Railway: రైల్వే వర్గాల్లో విషాదం... కాచిగూడ ప్రమాదంలో గాయపడిన లోకోపైలెట్ మృతి

  • కాచిగూడ వద్ద రైలు ప్రమాదం
  • హంద్రీనీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
  • లోకోపైలెట్ చంద్రశేఖర్ కు తీవ్రగాయాలు
  • కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన చంద్రశేఖర్
ఇటీవల కాచిగూడ వద్ద హంద్రీనీవా ఎక్స్ ప్రెస్ ను ఓ ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఎంఎంటీఎస్ రైలు లోకోపైలెట్ చంద్రశేఖర్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని కొన్ని గంటల పాటు శ్రమించి రైలు క్యాబిన్ నుంచి బయటికి తీయగలిగారు. అయితే, నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితం ప్రాణాలు విడిచాడు. చంద్రశేఖర్ మృతితో రైల్వే వర్గాల్లో విషాదం నెలకొంది.
Railway
Kachiguda
Hyderabad
MMTS
Locopilot

More Telugu News