Nara Lokesh: ఈ గోడ చూస్తేనే జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది: నారా లోకేశ్

  • మహిళలపై వైసీపీ రౌడీల దౌర్జన్యం అంటూ ఆగ్రహం
  • ఒంటరి మహిళలను కూడా వదలడంలేదని ఆరోపణలు
  • జగన్ ఉన్మాదం తీవ్రస్థాయికి చేరిందని విమర్శలు
ఒంటరి మహిళలని కూడా చూడకుండా వైసీపీ రౌడీలు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ అనే మహిళ ఇంటి ముందు అడ్డుగా గోడ కట్టారని, ఈ గోడ చూస్తే జగన్ గారికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతుందని విమర్శించారు. వైసీపీ కడుతున్న గోడలతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా ఆపగలరేమో కానీ, ప్రజల్లో ఈ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను మాత్రం ఆపలేరంటూ ట్విట్టర్ లో స్పందించారు.

జగన్ గారి ఉన్మాదం పతాకస్థాయికి చేరిందని ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు చెప్పండి. ఇన్నాళ్లు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు అడ్డంగా గోడలు కట్టారు. ఇప్పుడు ఒంటరి మహిళలను కూడా వదలడంలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Jagan
Prakasam District
Telugudesam
YSRCP

More Telugu News