Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఆరోపణలను ఖండించిన బోడె ప్రసాద్
- రాజేంద్రప్రసాద్ కు నేడు డబ్బు ఇవ్వలేదు
- ఆయనతో నాకు ఎలాంటి నగదు లావాదేవీలు లేవు
- వైసీపీలోకి వెళ్లగానే వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదు
టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత బోడె ప్రసాద్ ఖండించారు. ఎన్నికల సమయంలో బోడె ప్రసాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ డబ్బు తీసుకున్నారంటూ వంశీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బోడె ప్రసాద్ మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్ కు తాను ఎలాంటి నగదు ఇవ్వడం కానీ, ఆయన నుంచి తీసుకోవడం కానీ ఎప్పుడూ జరగలేదని చెప్పారు. రాజేంద్రప్రసాద్ తో తనకు ఎలాంటి నగదు లావాదేవీలు లేవని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజేంద్రప్రసాద్ కు అండగా ఉంటుందని చెప్పారు. వంశీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయం వేరు, స్నేహం వేరని చెప్పారు. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగత దూషణలు మంచిది కాదని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీ నేతలను గౌరవించిన వ్యక్తి వైసీపీలోకి వెళ్లగానే విమర్శలకు దిగడం మంచి సంప్రదాయం కాదని అన్నారు.