Chintamaneni Prabhakar: చింతమనేని విడుదల సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని టీడీపీ నిర్ణయం... రేపట్నించి పోలీస్ యాక్ట్ అమలు
- చింతమనేనికి బెయిల్
- రేపు విడుదల కానున్న చింతమనేని
- పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ
టీడీపీ నేత, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కు అన్ని కేసుల్లో బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఏలూరు న్యాయస్థానం ఆయనకు 4 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. మరికొన్ని కేసుల్లో ఇంతకుముందే బెయిల్ లభించింది. కాగా, కోర్టులో ష్యూరిటీ సమర్పించాల్సి ఉండడంతో ఆయన విడుదల రేపటికి వాయిదా పడింది.
ఇక చింతమనేని విడుదల సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 30 వరకు పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోలీస్ యాక్ట్ అమలు సమయంలో సభలు, ఊరేగింపులు, నినాదాలు చేయడం నిషిద్ధం. పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.