Mana Sand: బ్లూ ఫ్రాగ్ అధినేత ఫణికుమార్ ను విచారించిన సీఐడీ అధికారులు

  • ‘మన శాండ్’ను హ్యాక్ చేసినట్లు ‘బ్లూ ఫ్రాగ్’పై ఆరోపణలు
  • మూడో రోజూ కొనసాగిన సోదాలు 
  • సైబర్ క్రైమ్ సాయంతో డేటాను విశ్లేషిస్తున్నాం: సీఐడీ ఏడీజీ

ఏపీ ఇసుక వెబ్ సైట్ ‘మన శాండ్’ను హ్యాక్ చేసినట్టు బ్లూ ఫ్రాగ్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో రోజూ సంస్థలో సోదాలు కొనసాగాయి. కీలక సమాచారాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ అధినేత ఫణికుమార్ ను విచారించారు. ఆయనకు చెందిన రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ క్రైమ్ సాయంతో డేటాను విశ్లేషిస్తున్నామని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ ప్రభుత్వ వెబ్ సైట్ ను బ్లాక్ చేసి, ఇసుక కృత్రిమ కొరత సృష్టించినట్టు ఆధారాలు సేకరించామని, ‘క్లౌడ్’ లో వుంచిన సమాచారంపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసే వారి ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నామని అన్నారు.

More Telugu News