Vinod Kambli: సచిన్ లేకుండా నేనెలా ఉన్నానో చూడండి... చిన్ననాటి ఫొటో పోస్టు చేసిన వినోద్ కాంబ్లి

  • 664 పరుగులతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సచిన్, కాంబ్లి
  • 1989 నవంబరు 15న అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించిన సచిన్
  • ట్వీట్ చేసిన కాంబ్లి

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి బాల్యమిత్రులన్న సంగతి తెలిసిందే. స్కూల్ క్రికెట్ లో సచిన్, కాంబ్లి 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించారు. ఆ తర్వాతి కాలంలో సచిన్ పిన్నవయసులోనే టీమిండియా గడప తొక్కగా, ఆ తర్వాత కాంబ్లి కూడా ఎంటరయ్యాడు. కాగా, సచిన్ అరంగేట్రం చేసింది 1989 నవంబరు 15న. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంబ్లి ఓ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

తొలుత ఓ పిక్ లో సచిన్ తో కలిసి ఉండగా, సచిన్ లేకపోతే 664 పరుగుల వరల్డ్ రికార్డు భాగస్వామ్యం ఉండేదే కాదు అని పేర్కొన్నాడు. దానికిందనే మరో పిక్ లో కాంబ్లి ఒంటరిగా కనిపిస్తూ, సచిన్ లేకపోతే ఇలా వుండేవాడ్నేమో అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా అభిప్రాయపడ్డాడు.

More Telugu News