Telugudesam: టీడీపీ అనుబంధ సోషల్ మీడియా పేజీల్లో నాపై దుష్ప్రచారం జరుగుతోంది: పోలీసులకు ఫిర్యాదు చేసిన వంశీ

  • వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ అధినాయకత్వం
  • తనను కించపరుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన వంశీ
  • మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెడుతున్నారంటూ ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అనుబంధ సోషల్ మీడియా పేజీల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. తనను అవమానపర్చేలా అమ్మాయిల పేర్లతో ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వంశీ ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని సీపీని కోరారు.

తనను నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ కాలరాయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, కనీస మానవత్వం లేకుండా తన కుటుంబాన్ని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సోషల్ వింగ్ పేరుతో ఇలాంటివి జరుగుతున్నట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు.
Telugudesam
Vallabhaneni Vamsi
Vijayawada
Chandrababu
Police

More Telugu News