Amaravathi: రాజధాని అమరావతిపై కేంద్రం వైఖరి ఏంటో తెలియాలి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • అమరావతిపై ప్రభుత్వతీరును పార్లమెంట్ లో ప్రస్తావిస్తా
  • వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేశారు
  • ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఏం ఒత్తిడి తెచ్చారు?
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిపై కేంద్రం వైఖరి ఏంటో తెలియాలని  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అమరావతిపై ప్రభుత్వ తీరును పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని చెప్పారు. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించడం లేదని, గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆరు నెలల పాలనలో ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఏం ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.
Amaravathi
Telugudesam
Rammohan Naidu
Modi

More Telugu News