మరో 25 ఏళ్లు మహారాష్ట్ర సీఎంగా శివసేన నేత!: సంజయ్ రౌత్
- కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన చర్చలు
- తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
- సీఎం పదవిపై స్పందించిన సంజయ్ రౌత్
- ఐదేళ్ల గురించి మాత్రమే ఎందుకు చర్చించుకోవాలి? అని వ్యాఖ్య
ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చల విషయంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ... 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తుది నిర్ణయం తీసుకుంటారు. మాలో ఏ పార్టీ అధిక సీట్లు సాధించిందో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది' అని వ్యాఖ్యానించారు. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ముగిశాయని తెలుస్తోంది. ఐదేళ్ల పాటు శివసేన నేతే సీఎంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.