Parthasarathi: పార్థసారథికి దమ్ముంటే పెనమలూరులో ధర్నా చేయాలి: పంచుమర్తి అనురాధ

  • ఇసుక దొంగల పేర్లు ఇచ్చిన జగన్ స్పందించడం లేదు
  • ఎంత మంది చనిపోతున్నారో సీఎంకు కనిపించడం లేదు
  • వైసీపీ నేతలవి దొంగ దీక్షలు
ఇసుక దొంగల పేర్లను తమ పార్టీ ఛార్జ్ షీట్ లో ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంత మంది చనిపోతున్నారో జగన్ కు కనిపించడం లేదని చెప్పారు. తమ అధినేత చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షను దొంగ దీక్ష అని వైసీపీ నేతలు సంబోధిస్తున్నారని... వారివే దొంగ దీక్షలని అన్నారు. మద్దూరు ఇసుక టెండర్ ను వైసీపీ నేత పార్థసారథి తన అనుచరుడికి ఇచ్చారని ఆరోపించారు. దీక్ష చేస్తానంటున్న పార్థసారథికి దమ్ముంటే పెనమలూరులో దీక్ష చేయాలని సవాల్ విసిరారు.
Parthasarathi
YSRCP
Jagan
Panchumarthi Anuradha
Telugudesam

More Telugu News