నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు

Thu, Nov 14, 2019, 04:01 PM
  • విజయవాడలో కొనసాగుతున్న చంద్రబాబు ఇసుక దీక్ష
  • చంద్రబాబుకు షుగర్, బీపీలు సాధారణ స్థాయిలోనే
  • మంచినీరు తీసుకోవాలని బాబుకు సూచించిన వైద్యులు
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం విజయవాడలో ప్రారంభించిన పన్నెండు గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా డాక్టర్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు షుగర్, బీపీ స్థాయులు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మంచినీరు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఇదిలా ఉండగా, ఈ దీక్షలో జనసేన పార్టీ నేతలు రాపాక వరప్రసాద్, శివశంకర్ కూడా పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha