Sailaja: కేవలం సినిమాల్లో పాటలు పాడడం వల్లే ఇప్పటి సింగర్స్ బతకలేరు: ఎస్పీ శైలజ

  • అప్పటి పరిస్థితులు వేరు 
  •  ఇప్పుడు కనిపిస్తున్న కారణాలు వేరు
  • సింగర్స్ ను సంగీత దర్శకులే నిలబెట్టాలన్న శైలజ

తాజా ఇంటర్వ్యూలో శైలజ మాట్లాడుతూ .. చిత్రపరిశ్రమలో సింగర్స్ విషయంలో వచ్చిన మార్పులను గురించి ప్రస్తావించారు. నేను సినిమాలకి పాడే సమయంలో మమ్మల్ని వెతుక్కుంటూ కబురు వచ్చేది. ఫలానా పాటను ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని భావించి సంగీత దర్శకులు వెయిట్ చేసేవారు .. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫస్టు కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే వేరే సింగర్ కి కాల్ వెళ్లిపోతుందని నేను విన్నాను.

సింగర్స్ అందుబాటులో లేకపోతే సంగీత దర్శకులే ఆ పాటను పాడేస్తున్నారు. వరుసగా ఐదారు సినిమాలకి పాడే సింగర్స్ ఇప్పుడు కనిపించడం లేదు .. ఇప్పటి పరిస్థితుల్లో సినిమాల్లో మాత్రమే పాటలు పాడటం వలన సింగర్స్ బతకలేరు. సినిమా పాటలతో పాప్యులర్ అయితే ఆ తరువాత వాళ్లు కచేరీలతో తమ జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా సింగర్స్ ను నిలబెట్టవలసిన బాధ్యత సంగీత దర్శకులదే" అని చెప్పుకొచ్చారు.

More Telugu News