ప్రభాస్ సినిమా కోసం 25 రకాల భారీ సెట్స్

Thu, Nov 14, 2019, 02:38 PM
  • ప్రభాస్ కథానాయకుడిగా 'జాన్'
  • 180 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు 
ప్రస్తుతం ప్రభాస్ .. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లింది.

1960 కాలంనాటి కథతో ఈ సినిమా సాగుతుందట. అందువలన ఆ కాలానికి చెందిన వాటిలా కనిపించే 25 రకాల సెట్స్ ను హైదరాబాదులో వేయిస్తున్నారు. మేజర్ పార్టు షూటింగ్ ఈ సెట్స్ లోనే జరుగుతుందట. కృష్ణంరాజు .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha