Roja Ramani: అప్పట్లో చంద్రమోహన్ గారికి నేను కాస్త గట్టిగానే చెప్పాను: సీనియర్ నటి రోజా రమణి

  • చంద్రమోహన్ గారు సెట్లో వుంటే టెన్షనే 
  • ఆయనకి చెవిపై కొట్టే అలవాటు వుంది
  • చాలామంది ఆయన బారిన పడ్డారన్న రోజా రమణి
తాజా ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పారు. "చంద్రమోహన్ గారు సెట్లో వుంటే, ఆయన గురించి తెలిసినవారు కొంచెం జాగ్రత్తగానే వుంటారు. ఎందుకంటే ఆయనకి ఒక అలవాటు వుంది. ఎవరి పనిలో వాళ్లు ఉండగా ఆయన నెమ్మదిగా వెనక నుంచి వచ్చి, మధ్యవ్రేలు .. బొటన వ్రేలు మడిచి చిటిక వేసినట్టుగా 'చెవి' అంచుపై వెనకభాగంలో కొడతారు.

అంతే చెవి ఎర్రగా మారిపోయి .. ఆ బాధకి తట్టుకోలేక ఎంతటివాళ్లకైనా కళ్ల వెంట నీళ్లొచ్చేస్తాయి. అలా చాలామంది ఆయన బారినపడ్డారు. ఈ విషయం నాకు తెలిసి టెన్షన్ పడిపోయాను. చివరికి 'నన్నుగాని చెవిపై కొడితే చచ్చినా సెట్లోకి అడుగుపెట్టను' అని గట్టిగానే చెప్పాను. అందువలన ఆయన నన్ను ఏమీ అనలేదు. 'ఎందుకండీ అలా కొడతారు' అని ఎవరైనా అడిగితే నవ్వేసి ఊరుకుంటారు" అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Chandra Mohan

More Telugu News