Rajani: 'దర్బార్'కి డబ్బింగ్ మొదలెట్టేసిన రజనీ

  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీ 
  • కీలకమైన పాత్రలో సునీల్ శెట్టి 
  •  జనవరి 10వ తేదీన విడుదల  

రజనీకాంత్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'దర్బార్' సినిమాపైనే వుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం వాళ్లంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా తమిళ.. తెలుగు భాషల్లో ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు.

ప్రస్తుతం రజనీకాంత్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన ముంబైలోని సౌత్ జోన్ కి చెందిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇంతకుముందు రజనీ పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు చేసినా, ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. రజనీ సరసన నాయికగా నయనతార నటించిన ఈ సినిమాలో, నివేదా థామస్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. సునీల్ శెట్టి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News