Krishnam Raju: ఐసీయూలో కృష్ణంరాజు... హుటాహుటిన ఆసుపత్రికి ప్రభాస్!

  • గత రాత్రి చికిత్స నిమిత్తం కేర్ కు
  • ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స
  • షూటింగ్ ను వదులుకుని వచ్చిన ప్రభాస్
గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి గత రాత్రి కాస్తంత క్షీణించడంతో, ఆయన్ను కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తన తాజా చిత్రం 'జానూ' షూటింగ్ లో ఉన్న ప్రభాస్, విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం కృష్ణంరాజు పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచారని కుటుంబీకులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Krishnam Raju
Prabhas
Care
Hospital
ICU

More Telugu News