Sailaja: నా చెల్లెలితో పాడించండంటూ మా అన్నయ్య ఎవరికీ సిఫార్స్ చేయలేదు: ఎస్పీ శైలజ

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున సుశీల .. మరో వైపున జానకి తమ గానంతో మంత్రముగ్ధులను చేస్తున్న సమయంలోనే, ఒక కొత్త కోకిల తన ఉనికిని చాటుతూ కూసింది. ఆ కోకిల పేరే ఎస్పీ శైలజ. వివిధ భాషల్లో 6 వేల పాటలకి పైగా పాడిన శైలజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలిగా నేను అందరికీ తెలిసుండొచ్చు. కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేనే సంపాదించుకోవాలనే మనస్తత్వం నాది.

ఒక స్టేజ్ షో సమయంలో రావలసిన గాయని రాకపోతే అన్నయ్యతో కలిసి పాడవలసి వచ్చింది. అప్పటివరకూ నేను ఎలా పాడతాననేది కూడా ఆయనకి తెలియదు. తెలిసిన తరువాత కూడా నా చెల్లెలికి ఛాన్స్ ఇవ్వండి అని ఆయన ఎవరికీ సిఫార్స్ చేయలేదు. ఎక్కడో ఒక చోట నేను పాడిన పాటలను వినేసి సంగీత దర్శకులు అవకాశాలను ఇస్తూ వచ్చారు. అలా గాయనిగా నా కెరియర్ కొనసాగుతూ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Sailaja

More Telugu News