MMTS: హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల తాత్కాలిక రద్దు... ఉద్యోగులు, విద్యార్థుల వెతలు!

  • నిర్వహణాపరమైన కారణాలతో రద్దు
  • 19 రైళ్లు పూర్తిగా, 24 రైళ్లు పాక్షికంగా రద్దు
  • మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులు

నిర్వహణాపరమైన కారణాలతో హైదరాబాద్‌ లో ఎంఎంటీఎస్‌ రైళ్లను నేడు తాత్కాలికంగా రద్దు చేయడంతో కార్యాలయాలకు వెళ్లవలసిన ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లవలసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారంతా మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో, పలు స్టేషన్లు కమ్యూటర్లతో కిక్కిరిశాయి.

 నిన్న బుధవారం నాడు 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. నాంపల్లి – లింగంపల్లి, సికింద్రాబాద్‌ –ఫలక్‌ నుమా, జనగామ – ఫలక్‌ నుమా, నాంపల్లి – ఫలక్‌ నుమా, లింగంపల్లి – నాంపల్లి, ఫలక్‌ నుమా – సికింద్రాబాద్‌ రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News