Mahesh Babu: నా పిల్లలు, నా ప్రపంచం అంటూ ప్రిన్స్ మహేశ్ బాబు వీడియో!

  • నేడు బాలల దినోత్సవం
  • పిల్లలతో టైమ్ పాస్ చేసిన మహేశ్
  • ట్విట్టర్ లో వీడియోలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేడు బాలల దినోత్సవం కావడంతో, పిల్లలకు శుభాకాంక్షలు చెబుతూ, మహేశ్ రెండు వీడియోలను పోస్ట్ చేశారు. "నా పిల్లలు, నా ప్రపంచం... వారితో ఉంటే నేను కూడా నా బాల్యంలోనే ఉంటాను. అందరు చిన్నారుల భవిష్యత్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని క్యాప్షన్ పెడుతూ, వీడియోలు పోస్ట్ చేశారు. మహేశ్ బాబు ట్విట్టర్ లో పెట్టిన ఈ వీడియోలను మీరూ చూడవచ్చు. 
Mahesh Babu
childrens Day
Videos
Twitter

More Telugu News