AP Cabionet meet: ఏపీ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకు పచ్చజెండా

  • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
  • రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం
  • ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ఓకే

ఆంధ్రప్రదేశ్ లో మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు రాజధాని అమరావతిలో సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.   దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై మంత్రి కన్నబాబు తొలుత మాట్లాడారు.

మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయని, వారం కింద క్వింటాలు ధర రూ.2,200 ఉండగా, ప్రస్తుతం అది రూ.1,500కు పడిపోయిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా కొనుగోళ్లు చేయాలని సూచించారు. సీఎం చేసిన ఈ నిర్ణయాలతో పాటు, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట, వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రారంభించనున్న 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన అంశాలకు కూడా  కేబినెట్ ఆమోదం తెలిపింది.

More Telugu News