నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు: విజయసాయి రెడ్డి

- చంద్రబాబు, లోకేశ్ లపై విజయసాయి రెడ్డి విమర్శలు
- కొడుకేమో 4 గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు
- ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట
'కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు' అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.