ఆత్మహత్య చేసుకున్న నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్త.. ఎస్సై వేధింపులే కారణం?

Wed, Nov 13, 2019, 10:01 AM
  • నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కార్తీక్
  • ఎస్సై సుబ్బారావు వేధింపులే కారణమన్న కుటుంబసభ్యులు
  • వైసీపీ కోసం ఎస్సై చేసిన హత్య అన్న బీద రవిచంద్ర
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దగదర్తి ఎస్సై సుబ్బారావు వేధింపులు భరించలేక టీడీపీ కార్యకర్త కార్తీక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కార్తీక్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ, వైసీపీ నేతలు చెప్పినట్టుగానే నడుచుకోవాలంటూ ఎస్సై వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హోటల్ ను కూడా తొలగించారని తెలిపారు.

మరోవైపు, కార్తీక్ కుటుంబసభ్యులను టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఇతర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కింది స్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారుల మాట వినడం లేదని అన్నారు. ఇది వైసీపీ నేతల కోసం ఎస్సై చేసిన హత్య అని ఆరోపించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha