shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టును జల్లెడపట్టిన పోలీసులు.. ఏడుగురు అనుమానితుల అరెస్ట్

  • డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు
  • వందమంది కానిస్టేబుళ్లు, ఏసీపీ, ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు ఎస్సైలు పాల్గొన్న వైనం
  • ఆరు ట్యాక్సీలు సీజ్

శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రదేశంతోపాటు అనుమతులు లేకుండా తిరుగుతున్న ట్యాక్సీలను తనిఖీ చేశారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు ట్యాక్సీలను సీజ్ చేశారు. అనుమతులున్న ట్యాక్సీలలోనే ప్రయాణించాలని ఈ సందర్భంగా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. కార్డన్‌సెర్చ్‌లో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News