Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గ్లామర్ గురించి అనుపమ కబుర్లు 
  • రవితేజ కొత్త సినిమాకి ముహూర్తం 
  • మెహర్ రమేశ్ కొత్త బిజినెస్
    *  తనకి సంప్రదాయ బద్ధంగా ఉండడమే ఇష్టమంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'చిన్న చిన్న దుస్తులు ధరిస్తే అందంగా కనిపించవచ్చు అన్న దాంట్లో నాకు నమ్మకం లేదు. వస్త్రధారణ అన్నది మన పాత్రను బట్టి వుండాలి. అప్పుడే గ్లామర్ గా కనిపిస్తాం. నా వరకు నేను సినిమాల్లో నైనా, బయట అయినా సంప్రదాయ దుస్తులు ధరించడాన్నే ఇష్టపడతాను. అందులోనే గ్లామర్ గా కనిపించవచ్చు' అని చెప్పింది.
*  ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించే ఈ చిత్రం షూటింగును రేపు (నవంబర్ 14) హైదరాబాదులో ప్రారంభిస్తున్నారు.
*  గత కొంతకాలంగా వెనుకబడిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా మారుతున్నాడు. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం గుంటూరు పంపిణీ హక్కులను మెహర్ రమేశ్ సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం.  
Anupama
Raviteja
Shruti Hassan
Mahesh Babu

More Telugu News