Pavan: 'జార్జి రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్?

  • తెలుగు తెరపైకి మరో బయోపిక్
  • విద్యార్థి నాయకుడి చరిత్ర నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 17వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్  
'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రధారిగా 'జార్జి రెడ్డి' బయోపిక్ నిర్మితమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా .. విద్యార్థుల తరఫున పోరాడిన నాయకుడిగా 'జార్జి రెడ్డి' యువత మనసులో స్థానం సంపాదించుకున్నాడు. 25 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థుల చేతిలో ఆయన మరణించాడు.

అలాంటి జార్జిరెడ్డి జీవితచరిత్రకి జీవన్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. పోరాటపటిమ కలిగిన జార్జి రెడ్డి వ్యక్తిత్వం తనకి ఇష్టమని పవన్ అనేక వేదికలపై చెప్పారు. ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ వస్తాడో లేదో చూడాలి మరి.
Pavan
George Reddy

More Telugu News