Shane Watson: ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడిగా షేన్ వాట్సన్

  • నిబద్ధత ఉన్న క్రికెటర్ గా వాట్సన్ కు గుర్తింపు
  • ఏసీఏ ఏజీఎంలో వాట్సన్ నియామకంపై ప్రకటన
  • ఏసీఏ బోర్డు సభ్యుల సంఖ్య 10కి పెంపు

ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు... షేన్ వాట్సన్. బంతిని అవలీలగా స్టాండ్స్ లోకి పంపగల బాహుబలి బ్యాట్స్ మన్ గా వాట్సన్ కు ఎంతో పేరుంది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వాట్సన్ లీగ్ లలో సత్తా చాటడం ద్వారా అభిమానులను అలరించాడు. బ్యాట్ తోనే కాదు బంతితోనూ అనేకసార్లు తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సిసలైన ఆల్ రౌండర్ ను ఇప్పుడో విశిష్ట పదవి వరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ లో కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా షేన్ వాట్సన్ నియమితుడయ్యాడు. వాట్సన్ ఏ స్థాయి జట్టుకు ఆడినా పూర్తి నిబద్ధతతో ఆడే ఆటగాడిగా అందరి మన్ననలు అందుకున్నాడు.

 సోమవారం రాత్రి జరిగిన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాట్సన్ నియామకాన్ని ప్రకటించారు. అంతేకాకుండా, ఏసీఏ బోర్డు సభ్యుల సంఖ్యను 10కి విస్తరించారు. కొత్తగా ఏసీఏ బోర్డులో ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, క్రిస్టెన్ బీమ్స్ తో పాటు మహిళా క్రికెట్ వ్యాఖ్యాత లిసా స్థాలేకర్ కు చోటిచ్చారు. ఆస్ట్రేలియాలో క్రికెటర్ల హక్కులు కాపాడడంలో, క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లకు మధ్యవర్తిలా వ్యవహరించడంలో ఏసీఏ కీలకపాత్ర పోషిస్తోంది. ఇలాంటి సంఘమే తమకూ ఉండాలని టీమిండియా క్రికెటర్లు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News