చివరికి చైతూనే సెట్ చేసుకున్న పరశురామ్
- 'గీత గోవిందం'తో హిట్ ఇచ్చిన దర్శకుడు
- స్టార్ హీరోలతో చేసేందుకు గట్టి ప్రయత్నాలు
- చైతూతోనే సరిపెట్టుకున్న పరశురామ్
ప్రభాస్ .. మహేశ్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేయాలనే పట్టుదలతో పరశురామ్ గట్టి ప్రయత్నాలే చేశాడటగానీ కుదరలేదు. చివరికి ఈ కథకి నాయకుడిగా ఆయన చైతూనే సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ సునీల్, పరశురామ్ సినిమాను కూడా నిర్మించనున్నాడని అంటున్నారు. భారీ హిట్ ఇచ్చిన పరశురామ్ కి మరో ఛాన్స్ దక్కడానికి ఏడాదికి పైనే పట్టడం ఆశ్చర్యకరమే.