Hyderabad: లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం.. పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయన్న వైద్యులు

  • కాచిగూడ రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ చంద్రశేఖర్
  • ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స
  • 24 గంటలు పర్యవేక్షణలో లోకో పైలట్

కాచిగూడ రైలు ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలట్‌ చంద్రశేఖర్ ను సహాయక సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి వెలికి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్, నాంపల్లిలోని కేర్ ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఆయన పక్కటెముకలు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని చెప్పారు.

రెండు కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని సూపరింటెండెంట్ డా.సుష్మ తెలిపారు. చంద్రశేఖర్ శరీరం మొత్తం గాయాలయ్యాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, ఆయనను 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, తమ ఆసుపత్రిలో ఇతర ప్రయాణికులు సాజిద్, శేఖర్, బెలేశ్వరమ్మ ఉన్నారని తెలిపారు.

More Telugu News