శరద్ పవార్ తో చర్చల కోసం ముంబయికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు
- చర్చల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం
- కాసేపట్లో ముంబయికి అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్
- శరద్ పవార్ తో చర్చలు జరపనున్న నేతలు
శరద్ పవార్ తో చర్చించేందుకు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్.. ముంబయి బయలుదేరారు. శరద్ పవార్ తో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ రోజు రాత్రి 8.30లోపు గవర్నర్ కు ఎన్సీపీ తమ నిర్ణయాన్ని స్పష్టంగా తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.