Lovers: ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పెట్టిన ప్రియుడు... ప్రియురాలి పెళ్లి రద్దు!

  • గతంలో కలసి తిరిగిన జంట 
  • ఆపై ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు
  • పగ తీర్చుకోవాలని చూసి కటకటాల వెనక్కు
తనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగి, ఇప్పుడు మరో యువకుడిని వివాహం చేసుకోనుందన్న అక్కసుతో చేసిన పని ఇప్పుడతన్ని కటకటాల పాలు చేసింది. న్యూఢిల్లీ సమీపంలోని నోయిడా వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన యువతి నోయిడాలో నివాసం ఉంటుండగా, ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. వివాహానికి ముందు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిన ఆమె, గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయితే, అతను మాత్రం ఆమెను వదల్లేదు.

ఈ నేపథ్యంలో తన ప్రియురాలికి వివాహం జరగబోతోందని తెలుసుకున్న అతను, గతంలో ఆమెతో కలిసివున్న సమయంలో తీసుకున్న చిత్రాలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ చిత్రాలు అటూ, ఇటూ తిరిగి వరుడికి చేరాయి. దీంతో అతను ఆగ్రహంతో వివాహాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో బావురుమన్న వధువు, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Lovers
New Delhi
Marriage
Police

More Telugu News