BJP: గతేడాది బీజేపీకి రూ. 700 కోట్ల విరాళం... సగం డబ్బు 'టాటా' నుంచే!

  • రూ. 356 కోట్లు విరాళమిచ్చిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్
  • ప్రూడెంట్ సంస్థ నుంచి రూ. 54.25 కోట్లు
  • ఈసీకి పంపిన రిపోర్టులో బీజేపీ

భారతీయ జనతా పార్టీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 700 కోట్ల మేరకు విరాళాలు వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి అందాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్టులో బీజేపీ స్వయంగా వెల్లడించింది. ఈ మొత్తం విరాళాల్లో సగం టాటా సంస్థ నుంచే రావడం గమనార్హం. టాటా సన్స్ అనుబంధ సంస్థగా ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి దాదాపు రూ. 356 కోట్ల విరాళం బీజేపీకి అందింది.

ఇండియాలో మరో సంపన్న ట్రస్ట్ గా ఉన్న ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి రూ. 54.25 కోట్లు విరాళంగా లభించింది. ఇక కమలనాధులకు విరాళాలు ఇచ్చిన సంస్థల్లో భారతీ గ్రూప్, హీరో మోటార్ కార్ప్, డీఎల్ఎఫ్, జేకే టైర్స్, ఓరియంట్ సిమెంట్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్ తదితర సంస్థలూ ఉన్నాయి.

తాము రూ. 20 వేలను మించిన విరాళాలను ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించామని ఈ సందర్భంగా బీజేపీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News