Annavaram: కార్తీక మాస శుభవేళ... అన్నవరం కొండపై అన్యమత భజనలతో తీవ్ర కలకలం!

  • కార్తీక మాసం సందర్భంగా భజన కార్యక్రమం
  • కళావేదికపై అన్యమత ప్రార్థనలతో ఉద్రిక్తత
  • భజన బృందాన్ని పోలీసులకు అప్పగించిన అధికారులు

హిందువులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం జరుగుతోంది. అందునా కార్తీక పౌర్ణమి వచ్చింది. అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటువంటి సమయంలో కొండపై ఏర్పాటు చేసిన భక్తిగీతాలు, భజనల కార్యక్రమంలో అన్యమత ప్రార్థనలు జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు సేదదీరేందుకు భజనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేశ్‌ నటరాజ బాల భక్త సంఘం హాజరైంది.

తమ ప్రదర్శనలో భాగంగా ఏసుక్రీస్తును కీర్తిస్తూ వీరు పాటలు పాడారు. దీంతో పలువురు భక్తులు తీవ్రంగా కలత చెంది దేవస్థానం రిసెప్షన్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆలయ చైర్మన్ నుంచి అధికారుల వరకూ పరుగులు పెడుతూ కళావేదిక వద్దకు వచ్చి, కార్యక్రమాన్ని ఆపేయించారు. భజన బృందంపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా భజన బృందంలోని సభ్యులు ఆలయ సూపరింటెండెంట్ పై ఎదురు తిరగడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

More Telugu News