Trust Appointment: సుప్రీం ఆదేశాల మేరకు అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

  • తీర్పు అధ్యయనం కోసం అధికారుల బృందం ఏర్పాటు
  • న్యాయశాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలకోసం సంప్రదింపులు మొదలు పెట్టిన కేంద్రం
  • ట్రస్ట్ ఏర్పాటు కాగానే రామాలయ నిర్మాణం ప్రారంభం

అయోధ్య వివాదాస్పద భూమి కేసులో మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ.. ఆలయ నిర్మాణం కోసం ట్రస్ట్ లేదా ఇతర బాడీని ఏర్పాటు చేయాలని  కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించింది.

అయితే, ట్రస్ట్ ఏర్పాటుకు ముందే కోర్టు తీర్పును పూర్తిగా చదివి ఆమేరకు  ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని కేంద్రం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చట్టపరంగా ముందుకు సాగడానికి పాటించాల్సిన పద్ధతులపై న్యాయశాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలను కూడా కేంద్రం తీసుకోనుందన్నారు. కొత్తగా ఏర్పడే ఈ ట్రస్ట్ కు నోడల్ కేంద్రంగా ఏ మంత్రిత్వ శాఖ ఉంటుందన్నది ఇంకా తేలలేదని చెప్పారు.

More Telugu News