Jagan: సీఎం జగన్ ను కలవడంపై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

  • ఇవాళ జగన్ తో భేటీ అయిన బీజేపీ నేత
  • సీఎం ఫండ్ కోసం కలిశానని వెల్లడి
  • రాజధాని కమిటీకి సూచనలు చేశానన్న సోము
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ భేటీ రాజకీయంగా విపరీతమైన ఆసక్తి కలిగించింది. దీనిపై సోము వీర్రాజు స్వయంగా వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సీఎం జగన్ ను కలిశానని వెల్లడించారు. అంతేకాకుండా, రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు కూడా అందించానని, ఆ సలహాలను సీఎం జగన్ కు కూడా తెలిపానని పేర్కొన్నారు. దాంతో పాటే ఇంగ్లీష్ మీడియం అంశంపైనా సీఎంతో మాట్లాడానని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని అన్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో అవసరమని వీర్రాజు అభిప్రాయపడ్డారు.
Jagan
YSRCP
Somu Veerraju
BJP
Andhra Pradesh

More Telugu News