Bigg Boss: బిగ్ బాస్-3లో అసలైన విన్నర్ ఎవరో చెప్పిన శ్రీముఖి!

  • ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ మూడో సీజన్
  • విహారయాత్రకు వెళ్లొచ్చిన శ్రీముఖి
  • అభిమానులతో లైవ్
బిగ్ బాస్-3 రియాల్టీ షో ముగిసి రోజులు గడుస్తున్నా కంటెస్టెంట్లు, ప్రేక్షకులు ఇంకా ఆ మేనియా నుంచి బయటికి రాలేదు. చానళ్లలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాహుల్, శ్రీముఖి, పునర్నవి, వరుణ్ సందేశ్ తదితరులకు సంబంధించిన కథనాలు దర్శనమిస్తున్నాయి. బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే మాల్దీవులకు విహారయాత్ర కోసం వెళ్లిన శ్రీముఖి స్వదేశం తిరిగొచ్చింది. ఫ్యాన్స్ కోసం లైవ్ లోకి వచ్చిన ఈ యాంకర్ బ్యూటీ బిగ్ బాస్ మూడో సీజన్ పై తన అభిప్రాయాలు వెల్లడించింది.

ఈ షోలో బాబా భాస్కరే అసలైన విజేత అని శ్రీముఖి అభిప్రాయపడింది. బాబాతో పరిచయం అయిన తర్వాత ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. అన్ని కోణాల్లోనూ బాబా పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని, టాస్కులు చేయడంలోనూ, కిచెన్ లోనూ, వినోదం పండించడంలోనూ, వంట చేయడంలోనూ బాబా తర్వాతే ఎవరైనా అని కితాబిచ్చింది. తనవరకు బాబానే విన్నర్ అని స్పష్టం చేసింది.

రాహుల్ సిప్లిగంజ్ తో తనకు బిగ్ బాస్-3కి రాకముందే పరిచయం ఉందని, కానీ బిగ్ బాస్ ఇంట్లో స్నేహం కొనసాగించడం వీలు కాలేదని, ఇద్దరి మధ్య కొన్నిరోజులకే విభేదాలు వచ్చాయని శ్రీముఖి వెల్లడించింది.
Bigg Boss
Sreemukhi
Baba Bhaskar
Rahul Sipligunj

More Telugu News