Sundeep Kishan: విడుదలకి సిద్ధమైన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'

  • వినోదభరితంగా సాగే కథాకథనాలు
  • పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలు 
  • ఈ నెల 15 వ తేదీన విడుదల 

'నేను వీడని నీడను నేనే' వంటి హారర్ థ్రిల్లర్ చేసిన సందీప్ కిషన్, అందుకు పూర్తి భిన్నమైన కంటెంట్ తో ఈ సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' అనే పూర్తిస్థాయి కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందేమో చూడాలి.

More Telugu News