పునర్నవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదిలేదే లేదు: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్

- సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ కి క్రేజ్
- నటిగా కొనసాగుతున్న పునర్నవి
- ఇద్దరిపై ఆగని రూమర్లు
తనకి ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పునర్నవి, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్ చెప్పినా బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తావా?' అని అంతా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను" అని రాహుల్ తన మనసులోని మాటను చెప్పాడు. మరి ఈ జంటకు ఆ ఛాన్స్ తగులుతుందేమో చూడాలి.