national herald: అయోధ్య తీర్పుపై వివాదాస్పద వ్యాసం ప్రచురించిన నేషనల్ హెరాల్డ్.. క్షమాపణ చెప్పి తొలగించిన వైనం

  • ఆకార్ పటేల్ రాసిన వ్యాసాన్ని ప్రచురించిన నేషనల్ హెరాల్డ్
  • విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ
  • వెబ్‌సైట్ నుంచి వ్యాసాన్ని తొలగించి.. క్షమాపణ చెప్పిన పత్రిక
‘అయోధ్యలో హిందూ భక్తుడు ప్రార్థన ఎందుకు చేయకూడదు?’ శీర్షికతో వివాదాస్పద వ్యాసం ప్రచురించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక క్షమాపణలు తెలిపింది. ఆకార్ పటేల్ రాసిన ఈ వ్యాసం విమర్శలకు కారణమైంది. వీహెచ్‌పీ, బీజేపీ కోరుకున్నట్టుగానే సుప్రీం తీర్పు చెప్పిందని ఆకార్ పటేల్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, దీనికి పెద్దగా తేడా ఏమీ లేదని ఆయన రాసుకొచ్చారు.

కాంగ్రెస్ అధికార పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్ ప్రచురించిన ఈ వ్యాసంపై బీజేపీ భగ్గుమంది. భారత న్యాయవ్యవస్థను పాకిస్థాన్‌తో పోల్చడం సిగ్గుచేటని  బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన నేషనల్ హెరాల్డ్ వెంటనే ఆ వ్యాసాన్ని తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఈ వ్యాసం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని వేడుకుంది. అది పత్రిక అభిప్రాయం కాదని, వ్యాసకర్త అభిప్రాయం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సుప్రీం తీర్పును తాము గౌరవిస్తున్నట్టు స్పష్టం చేసింది.
national herald
Ayodhya verdict
Akar patel
BJP

More Telugu News