Ayodhya: అయోధ్యపై తీర్పు విని, కేరింతలు కొట్టిన సంస్కృతి వేద విజ్ఞాన కేంద్ర విద్యార్థులు!

  • నిన్న అయోధ్యపై తీర్పు
  • మూడు కాలాల సాక్ష్యాలు పరిశీలించామన్న ధర్మాసనం
  • తీర్పుపై సర్వత్ర హర్షం

తమ దృష్టికి వచ్చిన ఆధారాలన్నీ అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాముడు జన్మించాడని తెలుపుతున్నాయని, పురాణ కాలం నుంచి ఎన్నో అంశాలను పరిశీలించామని చెబుతూ, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో యూపీ, జబల్ పూర్ లోని సంస్కృతి వేద విజ్ఞాన కేంద్రం విద్యార్థులు కేరింతలు కొట్టారు. తీర్పు వెలువడిన తరువాత విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న వేద విద్యార్థులు, విజ్ఞాన కేంద్రంలో గంతులేస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి.

కాగా, నిన్నటి తీర్పు మత విశ్వాసాలకు సంబంధించిన వ్యాజ్యంగా కాకుండా, ఓ స్థలానికి సంబంధించిన వివాదంగానే భావించామని సుప్రీంకోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేసును ఐదుగురు న్యాయమూర్తులు విచారించగా, నలుగురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ న్యాయమూర్తి మాత్రం, ఈ వివాదం హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా పేర్కొనడం గమనార్హం. మొత్తం మూడు కాలాలకు సంబంధించి తమ ముందుకు వచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించి, ఈ తీర్పును వెలువరిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.

More Telugu News