Andhra Pradesh: రివర్స్ టెండరింగ్... మరో రూ. 33 కోట్లు ఆదా చేసిన జగన్ సర్కారు!

  • సత్ఫలితాలను ఇస్తున్న రివర్స్ టెండరింగ్
  • రూ. 92.04కే ఎయిర్ టెల్ నెలవారీ సేవలు
  • అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్, 1 జీబీ డేటా

వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కారు చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. గ్రామ సచివాలయం, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్‌ కార్డుల కొనుగోలులో ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లగా,  రూ.33.76 కోట్లు ఆదా అయింది. బహిరంగ మార్కెట్‌ లో నెలవారీ పోస్ట్‌ పెయిడ్‌ ఛార్జీలు రూ. 199 కాగా, రివర్స్ టెండరింగ్ లో రూ. 92.04కే సేవలందిస్తామని ముందుకు వచ్చిన ఎయిర్‌ టెల్‌ బిడ్ ను చేజిక్కించుకుంది.

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహించింది. ఎల్ 1గా నిలిచిన కంపెనీ, 4జీ సిమ్ లకు మూడేళ్లకుగాను రూ. 121.54  కోట్ల  టెండర్ దాఖలు చేయగా, రివర్స్ ఆక్షన్ లో ఎయిర్ టెల్ మరింత తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వానికి రూ. 33 కోట్లకు పైగా డబ్బు ఆదా అయ్యాయి. ఇక నెలకు రూ. 92.04 చెల్లించే చార్జ్ లో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, 1 జీబీ డేటా లభిస్తుంది.

More Telugu News