Guntur District: గుంటూరులో టీనేజ్ లవ్ విషాదాంతం!

  • మాచర్ల మండలం బీకే పాలేంలో ఘటన
  • మనస్తాపంతో ఫినాయిల్ తాగిన బాలిక
  • పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్న బాలుడు
గుంటూరు జిల్లాలో టీనేజ్ లవ్ వికటించింది. పెద్దల గొడవతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో బాలుడు మృతి చెందగా, బాలిక చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకే పాలేనికి చెందిన బాలుడు (17), బాలిక (16) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు గొడవ పడ్డారు. తమ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయన్న మనస్తాపంతో బాలిక ఇంట్లోని ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మరోవైపు, ఫినాయిల్ తాగిన బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
love
suicide
Crime News

More Telugu News