Indian Army: రాజస్థాన్‌లో పెద్దపల్లి జిల్లా ఆర్మీ జవాను ఆత్మహత్య

  • 8 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరిన కిరణ్
  • పనిచేస్తున్న ప్రదేశంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
  • కుటుంబ సభ్యులకు సమాచారం
రాజస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కమాన్‌పూర్ మండలం సిద్ధిపల్లె గ్రామానికి చెందిన జాబు కిరణ్ (27) రాజస్థాన్‌లోని బైతు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన కిరణ్.. మధ్యప్రదేశ్‌, అసోం, బీహార్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో పనిచేశాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లో పనిచేస్తున్నాడు. శనివారం అతడు పనిచేస్తున్న ప్రదేశంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అధికారులు అతడి మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.  

Indian Army
Peddapalli District
jawan
suicide

More Telugu News