Chandrababu: అదే జరిగితే చంద్రబాబును ఆ దేవుడే కాపాడాలి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • ఇసుకపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపణ
  • పవన్ టీడీపీకి వత్తాసు పలుకుతున్నాడని విమర్శలు
  • మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంపైనా స్పందన
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా ఇసుక వల్లేనని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇసుకపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి వత్తాసు పలుకుతున్నాడని, కోకలో పీలికలా తయారయ్యాడని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికితీస్తే 16 ఏళ్లు జైల్లో ఉంటారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అదే జరిగితే ఆయన్ను ఆ దేవుడే కాపాడాలని అన్నారు. అంతేగాకుండా, చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ రోడ్డు ప్రమాదంపైనా ఆయన స్పందించారు. దారుణ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని తెలిపారు.
Chandrababu
Pawan Kalyan
Telugudesam
YSRCP
Jana Sena
Peddireddy

More Telugu News