spg: ఇన్నాళ్లూ మీ నీడన సురక్షితంగా ఉన్నాం: ఎస్పీజీ చీఫ్ కి సోనియా లేఖ

  • ఎస్పీజీ భద్రతను విరమించిన నేపథ్యంలో స్పందన
  • గాంధీ కుటుంబానికి మీరు చేసిన సేవ మరువలేనిదంటూ వ్యాఖ్యలు
  • ఎస్పీజీ భరోసాతో బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తించామని వెల్లడి
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) తమ కుటుంబానికి కల్పించిన రక్షణ పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నాయకులకు కల్పించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిపే సమీక్షలో కేంద్రం ఎస్పీజీ భద్రతను ఇటీవల తొలగించింది. ఈ నేపథ్యంలో సోనియా, ఎస్పీజీ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావంతో 28 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి కల్పించిన భద్రత పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

‘ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం సురక్షితంగా ఉంది. అది మావెంట ఉండటంతో మా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించగలిగాం. ఎస్పీజీ అద్భుతమైన దళం. బలగాలకు దేశభక్తితోపాటు, పనిని కచ్చితంగా నిర్వహించే సామర్థ్యముంది. మా కుటుంబానికి అంకితభావంతో రక్షణ కల్పించినందుకు ప్రశంసిస్తున్నా’ అని పేర్కొన్నారు.

ఎస్పీజీ భద్రత విరమణతో ప్రస్తుతం గాంధీ కుటుంబం జడ్ ప్లస్ భద్రత పరిధిలోకి వచ్చింది. ఇందులో వందమంది సీఆర్ ఫీఎఫ్ జవాన్లతో కూడిన బృందం గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.

spg
Gandhi Famaily
Withdrawn
Thanks to Spg
Sonia Gandhi
Congress party Chief

More Telugu News