Ayodhya: సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇలాంటి తీర్పు రాలేదు... ఎందుకంటే!

  • 1045 పేజీలతో సుదీర్ఘమైన తీర్పు
  • జడ్జి పేరు లేకుండా తీర్పు వెల్లడి
  • సుప్రీం చరిత్రలో ఇదే ప్రథమం

అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది. మూడు దశాబ్దాలుగా సాగిన సుదీర్ఘమైన న్యాయప్రక్రియ నేటితో ముగిసింది. 2.77 ఎకరాల భూమి హిందువులదేనని, దాన్ని రామమందిరం నిర్మాణానికి అప్పగిస్తూ సుప్రీం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో రామజన్మభూమికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ తీర్పు చారిత్రాత్మకం. అయితే, సుప్రీం కోర్టు చరిత్రలో ఇలాంటి తీర్పు ఎప్పుడూ రాలేదు.

కారణం ఏంటంటే, ఈ తీర్పు రాసిన జడ్జి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు, తీర్పు ప్రతుల్లోనూ న్యాయమూర్తి పేరు లేదు. తీర్పు రాసిన జడ్జి పేరు వెల్లడించని సందర్భాలు సుప్రీం చరిత్రలో ఇదే ప్రథమం. ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేరిటే తీర్పు వెలువడింది. 1045 పేజీల తీర్పులో 116 పేజీల ప్రత్యేక అనుబంధాన్ని పొందుపరిచారు. ఈ అనుబంధంలో పూర్తిగా రామజన్మభూమిపై హిందువుల విశ్వాసాలనే ప్రస్తావించారు.

More Telugu News