Ayodhya verdict: సంబరాలు ఉద్రిక్తతలకు తావివ్వకూడదు: వీహెచ్ పీ

  • సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం
  • 491 సంవత్సరాల పోరాటం తర్వాత దక్కిన విజయమిది
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పండగ చేసుకోవాల్సిన సందర్భమిది
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల విశ్వహిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమని పేర్కొంది. వీహెచ్ పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు.  ‘ఇది సంతోషకరమైన రోజు, 491 సంవత్సరాలు  పోరాటం, యుద్ధాలు, త్యాగాల అనంతరం దక్కిన విజయం ఇది’ అని అన్నారు.

సత్యం, న్యాయం పక్షాన కోర్టు నిలిచిందన్నారు. 40 రోజులు, 200 గంటలపాటు సుప్రీంకోర్టు విచారణ కొనసాగించి ఇచ్చిన తీర్పు ప్రపంచ న్యాయస్థానాల తీర్పుల్లోనే గొప్పదన్నారు. ఈ రోజు హిందువులు పండగ చేసుకోవాల్సిన సందర్భమన్నారు. ఇక్కడ ఒకరు గెలిచి, ఒకరు ఓడలేదన్నారు. సంబరాలు ఉద్రిక్తతలకు తావివ్వరాదని చెప్పారు. త్వరతగతిన కేంద్రం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.  
Ayodhya verdict
Vishwa Hindu Parishad
VHP
Comments

More Telugu News