ayodhya: అయోధ్య తీర్పు: మసీదు నిర్మాణానికి ముందు ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్న సుప్రీంకోర్టు

  • మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ చెప్పలేదు
  • మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేదు
  • యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం

అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ స్పష్టం చేశారు. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చెప్పారు.

అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని గొగోయ్ అన్నారు. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని స్పష్టం చేశారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వెల్లడించారు.

More Telugu News