నాకు బీజేపీ రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తున్నారు: సూపర్ స్టార్ రజనీకాంత్
- వారి ఉచ్చులో పడను
- తమిళ నాట నాయకత్వ శూన్యత ఏర్పడింది
- రాజకీయపార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తా
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు, తమిళ ప్రాచీన కవి తిరువళ్లూరు చిత్రాన్ని బీజేపీ ట్వీట్ చేయడంపై నెలకొన్న వివాదంపై మీ స్పందన ఏమిటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రజనీ సమాధానమిస్తూ.. తిరువళ్లూరుతో పాటు తనపై కూడా కాషాయరంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ చెప్పారు. తమిళనాట నాయకత్వ శూన్యత నెలకొందన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తానని పేర్కొన్నారు.