Galla Ashok: గల్లా అశోక్ సరసన 'ఇస్మార్ట్' హీరోయిన్!

  • హీరోగా ఎంట్రీ ఇస్తున్న గల్లా జయదేవ్ తనయుడు
  • ఈ నెల 10న సినిమా ప్రారంభం
  • హీరోయిన్ గా నిధి అగర్వాల్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, అశోక్ గల్లా తల్లి పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న చిత్రం ప్రారంభం కానుంది. కాగా, అశోక్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న చర్చకు తెరపడింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి మంచి మార్కులే కొట్టేసింది.

More Telugu News