అగ్రిగోల్డ్ బాధితులకిచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు: మంత్రి బొత్స
- విజయనగరంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
- గత ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పాయన్న బొత్స
- మరికొన్ని విడతల్లో చెల్లింపులు చేస్తామని వెల్లడి
పదివేల రూపాయలలోపు డిపాజిట్ చేసిన జిల్లాలోని 57,941 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు రూ.36.99 కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. మొదటి విడతగా పదివేల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. రెండో విడతలో మరో పదివేల రూపాయలు, అనంతరం మిగిలింది చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చి తప్పాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలను తీర్చేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు.